Skip to content

Latest commit

 

History

History
118 lines (61 loc) · 16.2 KB

telugu.md

File metadata and controls

118 lines (61 loc) · 16.2 KB

BBC తెలుగు

టీ తాగుదామని రైలు దిగి, 20 ఏళ్లు మగ్గిపోయిన విజయనగరం వాసి, అసలేమైందంటే..

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 3:16:38 PMకి

టీ తాగి రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. ఆయనక్కడే చిక్కుకుపోయారు. ఈ దురదృష్టకర ఘటన చివరకు ఆయన్ను 20 ఏళ్ల పాటు వెట్టిచాకిరీలో మగ్గిపోయేలా చేసింది. చివరకు ఎలా బయటపడ్డారంటే..

SLBC Tunnel:'దగ్గరి దాకా వెళ్లినం.. లోపల ఎలా ఉందంటే..'

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 4:36:00 PMకి

SLBC సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా, సింగరేణి కార్మికులు సొరంగం లోపలికి వెళ్లి వచ్చారు.

ఏపీ బడ్జెట్: తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్, 'సూపర్ సిక్స్' పథకాల మాటేంటి?

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 12:59:18 PMకి

తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి ఉచితంగా మూడు వంట సిలిండర్ల హామీలు.. ప్రత్యక్ష నగదు బదలీ పథకాలకు సంబంధించినవి. వాటికి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..

బద్రీనాథ్: విరిగిపడిన మంచు చరియలు, రంగంలోకి ఆర్మీ, కొనసాగుతున్న సహాయక చర్యలు

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 11:19:32 AMకి

ఆర్మీ కోసం జరుగుతున్న ఓ రోడ్డు నిర్మాణంలో 55 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారంతా మంచుచరియల్లో చిక్కుకుపోయారని కలెక్టర్ సందీప్ తివారీ చెప్పారు.

ఫిల్టర్, ఆర్ఓ వాటర్, మరిగించిన నీరు.. వీటిలో ఏది మంచిది?

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 6:02:59 AMకి

మంచినీటి నాణ్యతను కొలిచేందుకు, ఆ నీరు తాగేందుకు సరైందా కాదా గుర్తించేందుకు కనీసం 60 రకాల పరీక్షలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రతిపాదించింది. వీటిని ఇండియన్ స్టాండర్డ్స్ డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్స్-10500 అంటారు. నీటి ఆమ్లత్వమే డ్రింకింగ్ వాటర్ పీహెచ్. ఇది డబ్ల్యూహెచ్ఓ, బీఐఎస్ ప్రకారం.. 6.5-8.5 మధ్య ఉండాలి.

పురుషులకూ పొదుపు సంఘాలు.. ఎంత రుణం ఇస్తారంటే

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 4:57:01 AMకి

కనీసం ఐదుగురు పురుషులతో గ్రూప్ ఏర్పాటు చేయాలి. గరిష్ఠంగా ఎంతమందైనా ఉండొచ్చు. ఒక గ్రూపుగా ఏర్పడితే బ్యాంకులు రుణాలను అందజేస్తాయి. ఆ మొత్తాలను తిరిగి వాయిదాల రూపంలో చెల్లించవచ్చు.

బస్‌స్టాండ్‌లో యువతిపై అత్యాచారం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వ్యాఖ్యలపై వివాదమేంటి

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 3:43:35 AMకి

"ఆమెను మాటల్లో పెట్టి ఆమె ఎక్కడకు వెళుతుందో తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి తాను ఫల్తాన్‌కు వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత నిందితుడు ఫల్తాన్ వెళ్లే బస్సు వేరే చోట ఆగుతాయని చెప్పాడు. ఆమెకు బస్సు చూపిస్తానని చెప్పి వేరే చోటకు తీసుకెళ్లాడు" అని డిప్యూటీ కమిషనర్ వివరించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ : 'ఇది ఎవరి పాపం?' అని కేసీఆర్ ఎందుకు అన్నారు

27, ఫిబ్రవరి 2025, గురువారం 1:42:20 PMకి

అప్పట్లో ప్రాజెక్టుల వివరాలన్నీ వెల్లడించడమే కాదు, వాటిని రీ డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఆ సమయంలో కాళేశ్వరం నిర్మాణం అవసరాన్ని బలంగా వినిపించారు.

‘ప్రభుత్వం మా బెడ్‌రూమ్‌లోకి ఎందుకు తొంగిచూస్తోంది?’

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం 1:34:39 AMకి

సహజీవనం చేయాలనుకునే జంట సమాచారాన్ని రిజిస్ట్రార్ స్థానిక పోలీసులకు పంపిస్తారు. జంటలో ఎవరన్నా 21 ఏళ్ల కన్నా తక్కువ వయసుంటే వారి తల్లిదండ్రులకు విషయం తెలియజేస్తారు.

ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని ఎందుకు అంటాం, ఆ పదం ఎలా పుట్టింది?

21, నవంబర్ 2024, గురువారం 2:33:42 PMకి

కొత్తవారిని కూడా ‘హలో’ అని పలకరించి మాటలు కలుపుతుంటాం. పరిచయాలకు, సంభాషణలకు తొలి మెట్టు అయిన హలో అనే పదం ఎలా పుట్టింది? మన వాడుకలోకి ఎలా వచ్చింది?

త్రివేణి సంగమం: తెలుగురాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,ఏయే నదులు కలుస్తాయి?

26, జనవరి 2025, ఆదివారం 5:43:31 AMకి

సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.

డిజిటల్ లెగసీ విల్: మనం చనిపోయాక ఫేస్‌బుక్, ట్విటర్‌ అకౌంట్లను ఏం చేస్తారు?

16, మార్చి 2024, శనివారం 1:16:40 AMకి

ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లను వాడుతున్నారు. అయితే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారికి చెందిన ఆన్‌లైన్ ఉనికి ఏమవుతుందనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఒక ఇంజినీర్ ట్రైన్ మిస్ కావడం వల్ల ఇంత పెద్ద ఆవిష్కరణ సాధ్యమైందని తెలుసా?

1, డిసెంబర్ 2024, ఆదివారం 6:22:06 AMకి

1879లో సర్ శాన్‌ఫోర్డ్ ఫ్లెమింగ్ రైలును మిస్ అయ్యారు. కెనడాలో రైలు ఇంజనీర్ అయిన ఫ్లెమింగ్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదే టైమ్ జోన్‌. 1883 నవంబర్ 18న అమెరికా, కెనడాల్లోని రైలు పరిశ్రమలు ఫ్లెమింగ్ ప్రతిపాదనను ఆమోదించాయి.

పాకిస్తాన్: రెండేళ్లపాటు పతాక శీర్షికలకెక్కిన ఆమె పేరు  చనిపోయిన రోజు ఎందుకు కనిపించలేదు,  అత్యంత మిస్టరీ మరణంలో ఆమె పాత్ర ఏంటి?

2, డిసెంబర్ 2024, సోమవారం 5:15:43 AMకి

ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ వేరు పడి బంగ్లాదేశ్ అయింది. అయినప్పటికీ షెహనాజ్ ఎల్లప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచేవారు. డాన్‌తో పాటు ఇతర సాయంకాలం పత్రికలు షెహనాజ్ సెక్స్ లైఫ్ గురించి వార్తలు రాసేవి. ఆమెకు సంబంధించినప్రతి విషయం పత్రికల్లో వచ్చేది. దీనివల్ల పిల్లలు వార్తాపత్రికలు చదవకూడదని ప్రజలు పేపర్లను వేయించుకోవడం మానేశారు.